: గోపూజలే తప్ప రక్షణకు చర్యలేవి?: బీజేపీకి షీలా దీక్షిత్ సూటి ప్రశ్న
గోవుల రక్షణ పేరిట దళితులపై దాడులు పెరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని షీలా దీక్షిత్, బీజేపీపై మండిపడ్డారు. బీజేపీ కేవలం గోవులను పూజిస్తుందే తప్ప, వాటి రక్షణకు చర్యలు తీసుకోవడాన్ని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఓ న్యూస్ ఏజన్సీకి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె, "గోవుల సంరక్షణ మన బాధ్యత. యూపీ గురించి మాట్లాడాల్సి వస్తే, ఆవులతో రోడ్లన్నీ నిండిపోయాయి. వీటన్నింటినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. బీజేపీ కేవలం గోవులను పూజిస్తుంది. వాటిని రక్షించలేకపోతోంది" అని ఆరోపించారు. గో సంరక్షణ పేరిట జరుగుతున్న హింసాత్మక ఘటనలతో తనకు కోపం వస్తోందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని అన్నారు.