: 'జనగణమన'ను నిషేధించిన అలహాబాద్ స్కూల్
ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో ఎంఏ కాన్వెంట్ స్కూల్ లో జాతీయ గీతం 'జనగణమన అధినాయక జయహే...'ను నిషేధిస్తున్నట్టు ప్రకటించి కలకలం రేపింది. జాతీయ గీతంలోని 'భారత భాగ్య విధాత' అన్న వాక్యం ఇస్లాంకు వ్యతిరేకమని, అందువల్లే నిషేధాన్ని విధించామని స్కూలు మేనేజర్ స్పష్టంగా చెప్పడంతో, దీన్ని నిరసిస్తూ, 8 మంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. స్కూలు మేనేజ్ మెంట్ తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. ఆ స్కూలుపై కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ తెలిపారు.