: పేస్ దారిలోనే సానియా... తొలి రౌండులోనే ఓడిపోయిన సానియా-ప్రార్థన జోడి


కచ్చితంగా ఒలింపిక్ పతకాన్ని తెస్తానంటూ రియోకు వెళ్లిన హైదరాబాద్ టెన్నిస్ సంచలనం సానియా మీర్జా మహిళల డబుల్స్ విభాగంలో తీవ్ర నిరాశ పరిచింది. ఈ విభాగంలో ప్రార్థనా తొంబారేతో జతకట్టిన సానియా, చైనా జోడి షువాయ్ పెంగ్, షువాయ్ జాంగ్ చేతిలో తొలి రౌండులో ఓడిపోయారు. తొలి సెట్ ను 7-6 తేడాతో ఓడిపోయిన సానియా జోడీ, రెండో సెట్ ను 5-7తో సొంతం చేసుకున్నప్పటికీ, నిర్ణయాత్మకమైన మూడవ సెట్ ను 7-5తో పోగొట్టుకున్నారు. పురుషుల డబుల్స్ విభాగంలో పేస్ - బోపన్న జోడీ సైతం తొలి రౌండులోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News