: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎయిర్ ఇండియా విమానం నిలిపివేత
హైదరాబాద్ శివారులోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి మరికాసేపట్లో బయలుదేరాల్సిన ఎయిర్ ఇండియా విమానాన్ని అధికారులు నిలిపివేశారు. విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని గ్రహించి దాన్ని ఎయిర్‌పోర్టులోనే నిలిపివేశారు. శంషాబాద్ నుంచి విమానం రాజస్థాన్ వెళ్లాల్సి ఉంది. ప్రయాణికులని వేరే విమానంలో పంపించాలని ఎయిర్‌పోర్టు అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. విమానం నిలిపివేతపై ప్రయాణికులు ఆందోళన తెలుపుతున్నట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.