: తిరుపతిలో మహిళా ఖైదీ చేతికి గన్ ఇచ్చి వెళ్లిపోయిన పోలీసులు
పోలీసులు ఓ మహిళా ఖైదీ చేతికి గన్ ఇచ్చి వెళ్లిపోయిన ఘటన తిరుపతిలో వెలుగులోకొచ్చింది. తిరుపతి పద్మావతి ఆసుపత్రిలోని క్యాంటీన్‌లో ఓ మహిళా ఖైదీ గన్‌ను చేతిలో పట్టుకొని ఉండడం అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైంది. మహిళా ఖైదీకి వైద్య పరీక్షలు చేయించే నిమిత్తం పోలీసులు ఆమెను ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో వారు కాసేపు క్యాంటిన్‌లో కూర్చున్నారు. అయితే కానిస్టేబుళ్లు బయటికెళ్లి తమ పనిని చూసుకొని రావాలని అనుకున్నారేమో, తమ వద్దనున్న గన్‌ను ఆ మహిళా ఖైదీ చేతికిచ్చి పట్టుకోమని చెప్పి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ ఖైదీ క్యాంటిన్‌లోనే పోలీసుల కోసం గన్‌ను చేతిలో పట్టుకొని నిరీక్షించింది. అర్ధగంట తరువాత పోలీసులు వచ్చి ఆ మహిళను తీసుకెళ్లారు.