: రూ. 10 వేల ఆలస్య రుసుంతో ఎంసెట్ దరఖాస్తుకు అవకాశం
ఎంసెట్ పరీక్షకు రూ. 5 వేల రూపాయల ఆలస్యం రుసుంతో దరఖాస్తు చేసుకునే అవకాశం నిన్నటితో ముగిసింది. నేటి నుంచి ఎంసెట్ కు దరఖాస్తు చేయాలనుకునేవారు రూ. 10 వేల ఆలస్య రుసుం కింద చెల్లించాల్సి ఉంటుంది. ఇందుకు మే 7 చివరితేదీ. జేఎన్టీయూ-హెచ్ ఆధ్వర్యంలో ఎంసెట్ పరీక్షను మే 10న రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్నారు. కాగా, రూ. 5 వేలు, రూ. 10 వేలు ఆలస్య రుసుంతో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు హైదరాబాద్ లో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. ఈ నెల 25 నుంచి హాల్ టిక్కెట్లు ఆన్ లైన్ లో అందుబాటులోకొచ్చిన సంగతి తెలిసిందే.