: రాహుల్ గాంధీపై వెంకయ్య వ్యంగ్యం!... ‘హోదా’పై రాహుల్ స్పందన హాస్యాస్పదమని కామెంట్!
ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని ఆసరా చేసుకుని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నేటి ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదాపై రాహుల్ గాంధీ స్పందించిన విషయాన్ని వెంకయ్య ప్రస్తావించారు. తెలుగు నేలను రెండు రాష్ట్రాలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ, ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని విభజన చట్టంలో ఎందుకు పెట్టలేదని ఆయన ప్రశ్నించారు. ఏపీకి అన్యాయం చేసిన పార్టీ ముమ్మాటికీ కాంగ్రెస్సేనని ఆయన ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించడం హాస్యాస్పదంగా ఉందని ఆయన మండిపడ్డారు.