: చందానగర్ సెంట్రా బిల్డింగ్ లో మంటలు!... భారీగా ఎగసిపడుతున్న అగ్ని కీలలు!
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాదు పరిధిలో మరో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నగరంలోని చందానగర్ పరిధిలోని సెంట్రా బిల్డింగ్ లో కొద్దిసేపటి క్రితం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఉన్నపళంగా ఎగసిన అగ్ని కీలలు క్షణాల్లో భవనాన్ని చుట్టుముట్టాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియరాలేదు. భారీ ఎత్తున ఎగసిపడుతున్న అగ్ని కీలల కారణంగా చందానగర్ వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.