: చంద్రబాబు టూర్ లో మీడియాపై ఆంక్షలు!... పాసులను పుట్టపర్తి ఎయిర్ పోర్టు గేటుకు వేలాడదీసిన జర్నలిస్టులు!


అనంతపురం జిల్లాలో మరికాసేపట్లో ప్రారంభం కానున్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పర్యటనలో అప్పుడే హైటెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. విజయవాడ సమీపంలో గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి బయలుదేరిన చంద్రబాబు కొద్దిసేపటి క్రితం అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండయ్యారు. సీఎం పర్యటనను కవర్ చేసేందుకు అప్పటికే పోలీసులు ఆయా మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులకు పాసులు మంజూరు చేశారు. అయితే, సదరు పాసులు చేతబట్టుకుని ఎయిర్ పోర్టుకు వెళ్లిన మీడియా ప్రతినిధులను పోలీసులు గేటు వద్దే అడ్డుకున్నారు. ఎయిర్ పోర్టు లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. ఈ క్రమంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి చెప్పినా పోలీసులు వినలేదు. దీంతో పోలీసుల వైఖరికి నిరసనగా వారు మంజూరు చేసిన పాసులను ఎయిర్ పోర్టు ప్రధాన గేటుకు వేలాడదీసి జర్నలిస్టులు నిరసనకు దిగారు.

  • Loading...

More Telugu News