: మీ సమస్యను నా సమస్యగా భావిస్తా.. చింతించొద్దు: టీడీపీ ఎంపీలతో మోదీ
ప్రధాని నరేంద్రమోదీతో టీడీపీ ఎంపీలు ఈరోజు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా అంశంపై మోదీకి వారు వివరించారు. ఆంధ్రప్రదేశ్ సమస్యను మిగిలిన రాష్ట్రాలతో పోల్చొద్దని జేసీ దివాకర్ రెడ్డి మోదీని కోరారు. ఈ సందర్భంగా మోదీ.. మీ సమస్యను నా సమస్యగా భావిస్తానని టీడీపీ ఎంపీలతో అన్నారు. ఏపీలో తలెత్తుతోన్న సమస్యలపై చింతించొద్దని ఆయన ఎంపీలకు సూచించారు. అన్ని అంశాలను సానుకూలంగా పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఏపీకి తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు.