: ‘హోదా’ సాధించాలన్న తపన చంద్రబాబులో ఉంది: మంత్రి శిద్దా రాఘవరావు
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేకహోదా సాధించాలన్న తపన రాష్ట్రముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో బలంగా ఉందని మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ప్రత్యేక హోదా కోసం తాము అన్ని విధాలా కృషి చేస్తున్నామని, అవసరమైనప్పుడు అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లడానికి తమ పార్టీ అధినేత రెడీగా ఉన్నారని పేర్కొన్నారు. హోదా సాధించే క్రమంలో తమ ప్రభుత్వం కేంద్రమంత్రులతో చర్చలు జరుపుతూనే ఉందని చెప్పారు.