: ‘హోదా’ బిల్లుపై ఈరోజు ఓటింగ్ ఉంటుందని భావించాం: సీఎం రమేశ్
కేవీపీ రాజ్యసభలో పెట్టిన ప్రత్యేక హోదా ప్రైవేటు బిల్లుపై ఈరోజు ఓటింగ్ ఉంటుందని తాము భావించినట్లు టీడీపీ పార్లమెంట్ సభ్యుడు సీఎం రమేశ్ అన్నారు. పార్లమెంట్ బయట ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజ్యసభలో బిల్లుపై ద్రవ్య బిల్లా.. ఆర్థిక బిల్లా అనే విషయాన్ని మాత్రమే చర్చించారని చెప్పారు. ప్రైవేటు బిల్లుని ద్రవ్య బిల్లా? కాదా? అన్నది తేల్చడం కోసం లోక్‌సభ స్పీకర్‌కు పంపారని వ్యాఖ్యానించారు. ఆనాడు అక్రమంగా కాంగ్రెస్ పాస్ చేసిన బిల్లుతోనే ఈరోజు ఏపీకి ఇన్ని సమస్యలొస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజల శ్రేయస్సు కోసం తాము చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు రాజ్యసభలో చిత్తశుద్ధితో వ్యవహరించలేదని ఆయన వ్యాఖ్యానించారు.