: కొనసాగుతున్న విద్యార్థుల దీక్ష‌.. విద్యావ్యవస్థపై ప్రభుత్వ తీరు బాగోలేదని వీహెచ్‌ విమర్శ


పోటీ ప‌రీక్ష‌ల గ‌డువు పొడిగించాలని, త‌మకు అన్ని సదుపాయాలు కల్పిస్తూ మెరుగైన‌ శిక్ష‌ణ‌ అందించాల‌ని డిమాండ్ చేస్తూ తెలంగాణ స్టడీ సర్కిల్‌లో అభ్యర్థులు చేస్తోన్న నిరాహార దీక్ష ఐదోరోజు కొన‌సాగుతోంది. నిన్న విద్యార్థుల దీక్షను పోలీసులు భగ్నం చేసి, వారిని పోలీస్ స్టేష‌న్‌కి త‌ర‌లించిన‌ప్ప‌టికీ వారు వెన‌క్కిత‌గ్గ‌కుండా మ‌ళ్లీ దీక్షను చేప‌ట్టారు. అక్క‌డ‌కు చేరుకున్న పోలీసులు అక్క‌డ‌ షామియానాలకు అనుమతి లేదని చెప్పారు. అయినప్పటికీ విద్యార్థులు త‌మ ప‌ట్టువ‌ద‌ల‌కుండా దీక్షకు దిగారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత వి.హనుమంతరావు విద్యార్థుల దీక్ష‌కు సంఘీభావం తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం నెర‌వేర్చాల‌ని డిమాండ్ చేశారు. ‘మిగ‌తా రాష్ట్రాల్లో మంచి ఫ‌లితాలు వ‌స్తున్నాయంటూ, మ‌న రాష్ట్రంలో విద్యార్థులు రాణించ‌డం లేదంటూ వారిపై విమ‌ర్శ‌లు చేయ‌డం కాదు.. ప్ర‌భుత్వం వారి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు కాబ‌ట్టే తెలంగాణ‌లో విద్యావ్య‌వ‌స్థ ఇలా త‌యార‌యింది. విద్యార్థుల‌కు మెరుగైన శిక్ష‌ణ‌, స‌దుపాయాలు క‌ల్పించ‌డం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం రూ.100 కోట్లు విడుద‌ల చేయాలి’ అని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News