: భూసేకరణ చట్టం అమలు చేయడం లేదని ప్రధాని దృష్టికి తీసుకెళతాం: జగ్గారెడ్డి
రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఈరోజు మెదక్ జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతులు తీసుకున్న రుణాలను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేని విషయాన్ని తాము ప్రధాని దృష్టికి తీసుకెళతామని ఆయన చెప్పారు. ఇప్పటికే ఆయనను కలిసేందుకు తాము అపాయింట్‌మెంట్ కోరినట్లు తెలిపారు. రైతుల పట్ల ప్రభుత్వం తమ తీరుని మార్చుకోవాలని ఆయన చెప్పారు.