: తెలంగాణ జాగృతి గ‌మ‌నం, గ‌మ్యం ప్ర‌జ‌ల కోస‌మే: ఎంపీ క‌విత


తెలంగాణ జాగృతి ప్ర‌జ‌ల కోస‌మేన‌ని దాని గ‌మ‌నం, గ‌మ్యం అంతా వారి అభివృద్ధి కోస‌మేన‌ని టీఆర్ఎస్‌ ఎంపీ క‌విత అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్య‌మంలోనే కాదు బంగారు తెలంగాణ సాధ‌న‌లోనూ తాము ముందుంటామ‌ని పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధి దిశ‌గా తాము కృషి చేస్తూనే ఉంటామ‌ని తెలిపారు. తెలంగాణ ప్ర‌భుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకుంటున్న చ‌ర్య‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని ఆమె అన్నారు. ఆత్మ‌హ‌త్య చేసుకున్న రైతుల‌ కుటుంబాల‌ను దత్తత తీసుకుని నెలనెలా భృతి ఇస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. యువ‌త‌కు ఉపాధిక‌ల్పనే ల‌క్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవ‌ల‌ప్ మెంట్ సెంట‌ర్లు న‌డుపుతున్నామ‌ని ఆమె చెప్పారు.

  • Loading...

More Telugu News