: రియో నిర్వాకం... లియాండర్ పేస్ కు రూమివ్వని అధికారులు


భారత టెన్నిస్ దిగ్గజం, ఆరుసార్లు ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొన్న లియాండర్ పేస్ కు రియోలో తీవ్ర అవమానం ఎదురైంది. ఒలింపిక్ గ్రామంలో ఆయనకు గది ఇవ్వలేదని తెలుస్తోంది. రియోకు వచ్చిన తరువాత అధికారులు గది ఇవ్వక పోవడంతో తన బ్యాగులు, సామానును చెఫ్ రాకేష్ గుప్తా రూములో ఆయన పెట్టుకోవాల్సి వచ్చిందని సమాచారం. తాను ఉండేందుకు ఓ చోటును కూడా చూపకపోవడం అసంతృప్తిని కలిగించిందని పేస్ వ్యాఖ్యానించాడు. న్యూయార్క్ లో 8 గంటలకు ఓ టోర్నమెంటును ముగించుకున్న తాను, 10:45 గంటలకు విమానం ఎక్కి రియోకు చేరానని చెప్పాడు. రూము లేకపోవడంతో వెంటనే ప్రాక్టీస్ కు వెళ్లిపోయానని, సాయంత్రానికి రూమిస్తారనే భావిస్తున్నానని వివరించాడు. కాగా, తన టెన్నిస్ భాగస్వామి రోహన్ బొప్పనతో కలసి ఒకే రూములో ఉండేందుకు లియాండర్ నిరాకరించినట్టు తెలుస్తోంది. బొప్పన, అలీ, టెన్నిస్ ఫిజియోలు మూడు రూములను తీసుకున్నారని పేస్ ఆరోపించాడు. బొప్పన, పేస్ జోడీ తమ తొలి మ్యాచ్ ని పోలాండ్ పై 6వ తేదీ రాత్రి 7:30 గంటలకు ఆడాల్సి వుంది.

  • Loading...

More Telugu News