: ‘బార్ బార్ దేఖో’ ట్రైలర్లో కత్రినా అందాలకు ఫిదా అయిపోతున్న అభిమానులు
బాలీవుడ్ నటులు సిద్ధార్థ్ మల్హోత్రా, కత్రినా కైఫ్‌లు జంటగా నటిస్తోన్న రొమాంటిక్ కామెడీ చిత్రం ‘బార్ బార్ దేఖో’ ట్రైలర్ ఇటీవలే విడుదలయింది. నిర్మాత కరణ్ జోహార్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసిన ఈ టైలర్లో కత్రినా కైఫ్ అందాలకు, ఆమె కనబరిచిన ఎక్స్ప్రెషన్స్కు అభిమానులు ఫిదా అయిపోతున్నారు. స్విమ్ సూట్లో కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది ఈ అమ్మడు. కత్రినా, సిద్ధార్థ్ మల్హోత్రాల మధ్య కెమెస్ట్రీ అదుర్స్ అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు. వచ్చేనెల 9న ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల చేయబోతోంది. ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.