: రాజ్యసభ ముందుకు సాయిరెడ్డి బిల్లు!... పార్టీ ఫిరాయింపుల చట్టానికి సవరణ కోరిన వైసీపీ ఎంపీ!


పార్లమెంటులో పెద్దల సభ... రాజ్యసభ ముందుకు ఏపీకి సంబంధించిన మరో కీలక ప్రైవేటు మెంబర్ బిల్లు రానుంది. సభకు కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి ఈ బిల్లును ప్రతిపాదించారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు చేయాలని ఆయన ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన బిల్లు కంటే ముందుగానే సభలో సాయిరెడ్డి బిల్లు చర్చకు రానుంది.

  • Loading...

More Telugu News