: నా ఇంటిలోనూ ‘హోదా’ పోరు!... సొంత అనుభవాన్ని చెప్పిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు!
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ తన వైఖరిని స్పష్టం చేసింది. ఏపీకి చెందిన అన్ని రాజకీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు కూడా ఏపీకి ప్రత్యేెక హోదా ఇవ్వాల్సిందేనని వాదిస్తున్నా... కుదరదని రాజ్యసభ సాక్షిగా బీజేపీ సీనియర్ నేత, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెగేసి చెప్పారు. ఈ క్రమంలో బీజేపీకి చెందిన ఏపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు... తాను సొంత అనుభవాన్ని ఎదుర్కొంటున్నానని నిన్న విజయవాడలో వ్యాఖ్యానించారు. తన భార్య కూడా ఏపీకి ప్రత్యేక హోదా కావాలంటోందని చెప్పి, అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. ప్రత్యేక హోదా సెంటిమెంట్ ఏపీ వ్యాప్తంగా బాగానే పనిచేస్తోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే దీనిపై తమ పార్టీ వైఖరి స్పష్టమైనా... అంతర్గత సమావేశాల్లో దీనిపై చర్చలు జరుపుతూనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు.