: రేపు కేవీపీ బిల్లును జైట్లీ ద్రవ్యబిల్లుగా ప్రకటిస్తారు: జైరాం రమేశ్
రేపు రాజ్యసభ ముందుకు కేవీపీ ప్రైవేటు మెంబర్ బిల్లు రానున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాపై వెనక్కితగ్గబోమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ పేర్కొన్నారు. బిల్లును కాంగ్రెస్ సీరియస్‌గా తీసుకుంటుందని ఆయన తెలిపారు. రేపు కేవీపీ బిల్లును కేంద్రం ద్రవ్యబిల్లుగా తేవాలని చూస్తోందని, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఇదే అంశాన్ని రేపు ప్రకటిస్తారని అభిప్రాయపడ్డారు. రాజ్యసభ ఛైర్మన్ ముందుకు ద్రవ్య బిల్లుగా కేవీపీ బిల్లు వచ్చే సూచనలున్నాయని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కేవీపీ తన ప్రైవేటు మెంబర్ బిల్లుని ఉపసంహరించుకోరని ఆయన చెప్పారు.