: ఈ పాట రోజూ పాడుకుంటాను: సింగర్ దామిని
‘మా పెరటి జామచ్చెట్టు పళ్లన్నీ...’ పాటను తాను రోజూ పాడుకుంటానని ప్రముఖ సింగర్ దామిని చెప్పింది. ఒక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘చిత్ర గారు పాటలంటే నాకు చాలా ఇష్టం. అప్పట్లో సింగర్లు చాలా లిమిటెడ్ గా ఉన్నారు. ఇప్పుడేమో చాలా మంది సింగర్లు ఉన్నారు. అందరూ న్యూ టాలెంటే.. ఎవరి టాలెంట్ వారిదే.. ఎవరి స్పెషాలిటీ వారిదే. ఒక సినిమాలో 6 పాటలుంటే ఆరు పాటలకూ వేరియేషన్ ఉంటోంది. ఈ వేరియేషన్ అనేది గతంలో పాటలతో పోలిస్తే చాలా ఎక్కువ. అప్పట్లో ఇళయరాజా గారి పాటల్లాంటివి ఇప్పుడు చేస్తే జనాలు అందరూ వింటారో లేదో డౌటే. ఇప్పుడేంటంటే, అంతా కమర్షియల్ మ్యూజిక్’ అని దామిని తన అభిప్రాయం వ్యక్తం చేసింది.