: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసు నమోదు


హైదరాబాద్ లోని గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పోలీసు కేసు నమోదైంది. గుజరాత్ లో దళితులపై గోరక్ష దళ్ సభ్యులు చేసిన దాడిని సమర్థిస్తూ రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బి. రాం ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు మంగళ్ హాట్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, గుజరాత్ లో దళితులను బహిరంగంగా చితకబాదిన సంఘటనపై రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ఒక వీడియోను రాజాసింగ్ గత నెల 30న తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు. వారికి తగిన శాస్తి జరిగిందంటూ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News