: గదుల్లోకెళ్లి తాళాలు వేసుకున్న 12 మంది విద్యార్థులు.. వారి డిమాండ్లు పరిష్కరించాలన్న కోదండరాం
పోటీ పరీక్షల తేదీల్లో మార్పులు చేయాలంటూ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టడీసర్కిల్ వద్ద నాలుగురోజులుగా విద్యార్థులు కొనసాగిస్తోన్న నిరాహారదీక్షను పోలీసులు భగ్నం చేయడానికి ప్రయత్నించడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 12 మంది విద్యార్థులు అక్కడి గదుల్లోకెళ్లి తాళాలు వేసుకున్నారు. స్టడీసర్కిల్ వద్దకు చేరుకున్న టీజేఏసీ ఛైర్మన్ ప్రొ.కోదండరాం పరిస్థితిని పరిశీలించారు. ఆందోళనకు దిగిన విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయమైనవేనని ఆయన అన్నారు. వారి డిమాండ్లను పరిష్కరించాలని సూచించారు.