: రేపు 12:30కు రండి... టీడీపీ ఎంపీలకు ప్రధాని అపాయింట్ మెంట్


ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాని వద్ద స్వయంగా ప్రస్తావించాలని భావిస్తూ, ఆయన అపాయింట్ మెంట్ కోరిన తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుల కోరిక నెరవేరింది. రేపు మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధానిని కలవవచ్చని ఆయన కార్యాలయం నుంచి టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయానికి సమాచారం వచ్చింది. దీంతో రేపు ఆయన్ను కలిసేందుకు తెలుగుదేశం ఎంపీలు సిద్ధమవుతున్నారు. పార్లమెంటులోని ప్రధాని కార్యాలయమే ఇందుకు వేదిక కానుండగా, ప్రత్యేక హోదాపై ప్రజల్లో నెలకొన్న సెంటిమెంటును ఎంపీలు ప్రధానికి వివరించనున్నారు. వెంటనే హోదా ఇవ్వకుంటే జరిగే నష్టాన్ని తెలియజేస్తారు.

  • Loading...

More Telugu News