: బెంగాల్ లో కుప్పకూలిన భారత వాయుసేన జెట్


ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన హాక్ అడ్వాన్డ్స్ శిక్షణా జెట్ విమానం ఈ ఉదయం కుప్పకూలింది. వెస్ట్ బెంగాల్ పరిధిలోని కలైకుండా ప్రాంతంలో ఈ జెట్ విమానం కుప్పకూలగా, అందులోని పైలట్, శిక్షకుడు ప్రమాదానికి క్షణాల ముందు పారాచూట్ సాయంతో దూకేసి ప్రాణాలు కాపాడుకున్నారు. ఎందువల్ల విమానం కుప్పకూలిందన్న సంగతి ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి కారణాలపై విచారణ జరిపిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు. కాగా, భారత వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానం అదృశ్యమై రెండు వారాలు గడిచినా, దాని ఆచూకీ ఇంకా తెలియరాలేదన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News