: అప్పటికి చంద్రబాబు పుట్టకపోవడం భారతదేశం చేసుకున్న అదృష్టం: వైఎస్ జగన్


భారతదేశం స్వాతంత్ర్య పోరాటం నాటికి చంద్రబాబునాయుడు పుట్టకపోవడం భారతదేశం చేసుకున్న అదృష్టమని, లేకపోతే బ్రిటిష్ వాళ్లు ఇచ్చినప్పుడే స్వాతంత్ర్యం తీసుకుందామని బాబు అనేవారంటూ వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నెల్లూరులోని శ్రీ కస్తూరి దేవి గార్డెన్స్ లో ఈరోజు నిర్వహించిన ‘యువభేరీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, బ్రిటిష్ వాళ్లు ఇచ్చినప్పుడే మనం స్వాతంత్ర్యం తీసుకుందామని చంద్రబాబు అనేవారని, స్వాతంత్ర్యం ఏమైనా సంజీవనా? అని కూడా ఆయన ప్రశ్నించేవారని అన్నారు. ఇప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండటం మనం ఏనాడో చేసుకున్న కర్మ అని జగన్ మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా, ఉద్యోగాలు, ఏపీపీఎస్సీ, రాష్ట్ర విభజన, డ్వాక్రా రుణాలు పలు అంశాల గురించి జగన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News