: జీఎస్టీ వల్ల ఏపీకి రూ.4700 కోట్ల నష్టం: మంత్రి యనమల
అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) బిల్లును తాము దేశ ప్రయోజనాల దృష్ట్యా స్వాగతించినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు తెలిపారు. జీఎస్టీ బిల్లుతో తీసుకొస్తున్న ఏకీకృత పన్ను విధానం దేశానికి, రాష్ట్రాలకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాలను జీఎస్టీ కౌన్సిల్ పరిష్కరిస్తుందని తెలిపారు. అయితే, జీఎస్టీ అమలు వల్ల ఏపీకి మాత్రం రూ.4700 కోట్ల నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు. బిల్లు వల్ల ఏపీకి ఏర్పడే నష్టాన్ని భర్తీ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉందని, బిల్లు అమలు అయ్యాక ఐదేళ్ల పాటు రూ.23,500 కోట్ల నష్టాన్ని భర్తీ చేయాలని ఆయన పేర్కొన్నారు.