: కేటీఆర్‌ను కలిసిన బ్రిటన్ ప్రతినిధుల బృందం.. అక్కడి పెట్టుబడులను తెలంగాణకు తరలిస్తామని వెల్లడి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను బ్రిటన్ ప్రతినిధుల బృందం ఈరోజు మధ్యాహ్నం కలిసి, పలు అంశాలపై చర్చించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’పై పరిశీలన నిమిత్తం బ్రిటన్ బృందం రాష్ట్రంలోని పరిస్థితులపై ఆరా తీసింది. రాష్ట్రంలో పరిశ్రమలు, పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, వాతావరణంపై ప్రతినిధుల బృందం హర్షం వ్యక్తం చేసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. బ్రిటన్‌లోని పెట్టుబడులను తెలంగాణకు తరలిస్తామని కేటీఆర్‌కు తెలిపింది.