: 'ఐఎస్ఐఎస్ ఉగ్రవాదివి' అంటూ భారతీయుడి ముఖంపై పదే పదే పిడిగుద్దులు గుద్దిన అమెరికన్


అమెరికాలోని ఒమాహాలోని ఓ రెస్టారెంటులో పనిచేస్తున్న భారత వంటగాడు సుతాహర్ సుబ్బురాజ్ ను 'నువ్వు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదివి' అంటూ గుర్తు తెలియని ఓ అమెరికన్ పదే పదే ముఖంపై పిడిగుద్దులు గుద్దాడు. ఓ నల్లటి హుడీ (టీ షర్ట్ కు కాలర్ బదులు తలకు కప్పుకునే క్యాప్ ఉంటుంది)ని ధరించి వచ్చిన వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడని, సుబ్బురాజ్ తలపై, నోటిపై కొట్టడంతో పాటు కాళ్లతో తన్నాడని 'ది ఒమాహా వరల్డ్ - హెరాల్డ్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 'ఐఎస్ఐఎస్, నా దేశాన్ని వదిలి పో' అంటూ ఆ వ్యక్తి కేకలు పెట్టాడని పేర్కొంది. అమెరికాలో ఈ తరహా ఘటనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా యూఎస్ లో లక్షలాదిగా ఉంటున్న హిందూ అమెరికన్లపై జాత్యహంకారం పెరుగుతూ ఉండటం పట్ల హిందూ అమెరికన్ ఫౌండేషన్ ఆందోళనను వ్యక్తం చేసింది. కాగా, స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి, సుబ్బురాజ్ పై దాడికి పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు విచారణ చేపట్టారని హెచ్ఏఎఫ్ డైెరెక్టర్ జై కన్సారా వెల్లడించారు. దాడికి పాల్పడిన వ్యక్తికి తాను సమాధానం చెప్పలేకపోయానని, అతని ఉద్దేశం కూడా తనకు తెలియలేదని సుబ్బురాజ్ తెలిపారు.

  • Loading...

More Telugu News