: దేనికో ఈ దిక్కుమాలిన జోహార్లు - దేనికో సిగ్గులేని దేబిరింపులు: తన వాక్చాతుర్యంతో బీజేపీపై బాలయ్య విమర్శలు


"మనం అప్పుడప్పుడూ అంటూ ఉంటాం... దేనికో ఈ దిక్కుమాలిన జోహార్లు - దేనికో సిగ్గులేని దేబిరింపులు... ఏలకో రాయబారమని బేలమవుదము... ఎందుకో రాష్ట్ర లబ్దికై ఇంత రగడ. యాచన అన్నదే ఎరుగని ఆంధ్రరాష్ట్రం ఎంత దిగజారి పోయింది. ఎంత వింత సిగ్గు చేటు.. ఇదిగో... మన భుక్తి మనచేతియందే గలదు. ముష్టి ఎత్తుకొనుటయందు కాదు" అంటూ బాలకృష్ణ ఏపీకి ప్రత్యేక హోదాపై తన వాక్చాతుర్యంతో బీజేపీపై విమర్శలు గుప్పించారు. హోదా కోసం ఉద్యమించేందుకే తాను కట్టుబడి వున్నానని స్పష్టం చేశారు. "ఆనాడు నాన్నగారు తెలుగువారి ఆత్మగౌరవం కోసం, తెలుగు జాతికి జరుగుతున్న అన్యాయాన్ని చాటి చెప్పి, దాన్ని నివారించడం కోసం ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆనాడు రామారావుగారు పార్టీ పెట్టడం, కొత్త ఒరవడి రాజకీయాల్లోకి తీసుకురావడం, ఇవాళ ఆహార భద్రతకానీ... ఇవన్నీ... ఇప్పుడున్న ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటున్నాయి. ఆనాడే మనం వీటన్నింటికీ శ్రీకారం చుట్టాం తెలుగువాళ్లం. ప్రజలను అలరించడానికి ఏవో ఉపన్యాసాలు ఇవ్వడం కాదు. వాళ్లు తగిన శాస్తి అనుభవిస్తారు. నా అభిప్రాయం నేను చెప్పాను. మిగతా వాళ్ల గురించి నాకు అనవసరం. నేను ఇప్పుడు చెప్పింది బీజేపీ గురించేగా? కేంద్ర ప్రభుత్వాన్నేగా మనం హెచ్చరించింది" అన్నారు.

  • Loading...

More Telugu News