: అచ్చెన్నతో బాలయ్య భేటీ!... హిందూపురంలో స్టేడియం నిర్మాణంపై ఆరా!


టాలీవుడ్ అగ్ర నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కొద్దిసేపటి క్రితం హైదరాబాదులోని ఉమ్మడి రాష్ట్రాల సచివాలయంలో ప్రత్యక్షమయ్యారు. ఉదయమే తన ఇంటి నుంచి బయలుదేరి సచివాలయానికి వచ్చిన బాలయ్య నేరుగా టీడీపీ సీనియర్ నేత, ఏపీ కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కార్యాలయానికి వెళ్లారు. అప్పటికే కార్యాలయానికి చేరుకున్న అచ్చెన్నతో బాలయ్య భేటీ అయ్యారు. హిందూపురంలో స్టేడియం నిర్మాణానికి సంబంధించి అచ్చెన్న గతంలో బాలయ్యకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. సదరు స్టేడియం నిర్మాణం అంశం ఎంతదాకా వచ్చిందని బాలయ్య ఈ సందర్భంగా ఆరా తీశారు. అంతేకాకుండా తన నియోజకవర్గానికి సంబంధించిన పలు సమస్యలను ఆయన అచ్చెన్న ముందు ప్రస్తావించారు.

  • Loading...

More Telugu News