: బొల్లారంలో దారుణం...ఇంటికి నిప్పు
సికింద్రాబాదులోని పారిశ్రామిక ప్రాంతం బొల్లారంలోని బాలాజీనగర్ లో దారుణం చోటుచేసుకుంది. రాజు అనే ఆగంతుకుడు అంతా నిద్రలో ఉన్న వేళ ఒక ఇంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ సమయంలో ఇంట్లో నిద్రిస్తున్న ముగ్గురు చిన్నారులతో పాటు దంపతులకు గాయాలయ్యాయి. నిందితుడు రాము పరారీలో ఉన్నాడు. దీనిపై కేసు నమోదు చేసిన బొల్లారం పోలీసులు, రాజు కోసం గాలింపు చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.