: అరకు రైల్వే లైన్ పై విరిగిన కొండ చరియలు...జంబో రైలుకు తప్పిన ప్రమాదం
అరకు రైల్వే లైన్ లో ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. విశాఖపట్టణం నుంచి అరకు వెళ్లే రైల్వే లైన్ పై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో జంబో రైలుకు తృటిలో ప్రమాదం తప్పింది. కిరండోలు-కొత్తవలస మార్గంలో శివలింగాపురం-టైడ స్టేషన్ల మధ్య పట్టాలపై కొండ చరియలు విరిగిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే సిబ్బంది ఆ రూట్లో ప్రయాణించాల్సిన జంబో రైలును తాత్కాలికంగా నిలిపివేశారు. పట్టాలపై పడిన బండరాళ్లను సిబ్బంది తొలగిస్తున్నారు. దీంతో పర్యాటక క్షేత్రానికి సందర్శకుల తాకిడి తగ్గింది.