: అరిటాకు సీఎం వద్దట!... స్టీలు ప్లేటు సీఎం కావాలంటున్న రఘువీరా!
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో తాను అరిటాకుగా మారానని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలపై ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి ఘాటుగా స్పందించారు. నిన్న మంత్రుల ఇళ్ల ఎదుట చీపుర్లతో నిరసన సందర్భంగా విజయవాడలో మీడియాతో మాట్లాడిన రఘువీరా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి అరిటాకు లాంటి సీఎం వద్దన్న ఆయన... స్టీలు ప్లేటు లాంటి సీఎం కావాలన్నారు. మొన్నటికి మొన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగం విని తన రక్తం మరిగిపోయిందన్న చంద్రబాబు... తాజాగా తాను అరిటాకులా మారిపోయానని వ్యాఖ్యానించడంపై రఘువీరా మండిపడ్డారు. ముళ్లు, మేకులు గుచ్చుకున్నా తట్టుకునేలా సత్తా ఉన్న సీఎం రాష్ట్రానికి కావాలన్నారు. నాసిరకం పనుల వల్ల పోలవరం కుడి కాలువకు గండి పడితే, దానిని విద్రోహ చర్యగా చెప్పడం సబబు కాదని రఘువీరా అన్నారు.