: ఉభయ గోదావరి జిల్లాలకు ‘గోదావరి గ్యాస్’!... ‘సిటీ గ్యాస్’ పేరిట పంపిణీకి రంగం సిద్ధం!


నవ్యాంధ్రలో కొత్తగా ‘గోదావరి గ్యాస్’ పేరిట వంట గ్యాస్ అందుబాటులోకి రానుంది. ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్, హెచ్ సీఎల్ కంపెనీల ఆధ్వర్యంలో అందుబాటులోకి రానున్న ఈ గ్యాస్ ‘సిటీ గ్యాస్’ పేరిట పైపు లైన్ల ద్వారా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు అందనుంది. ఈ మేరకు ఈ రెండు సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గోదావరి గ్యాస్ కంపెనీ ఏర్పాటుకు సంబంధించి నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సమక్షంలో ఒప్పందం కుదిరింది. గెయిల్ కు 74 శాతం, హెచ్ సీఎల్ కు 26 శాతం వాటాతో ఏర్పాటు కానున్న గోదావరి గ్యాస్... తదనంతర కాలంలో ఏపీలోని ఇతర జిల్లాలకు కూడా అందుబాటులోకి కానుంది. వంట గ్యాస్ తో పాటు పరిశ్రమలు, వాహనాలకు కూడా ఈ సంస్థ ద్వారా గ్యాస్ అందనుంది.

  • Loading...

More Telugu News