: పింఛన్ల పంపిణీ టెంట్ పీకేసీన కరణం!... జేబులోని రూ.50 వేలు తీసి పంచిన గొట్టిపాటి!


ప్రకాశం జిల్లాలో అధికార పార్టీకి చెందిన కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ ల మధ్య మరోమారు విభేదాలు పొడచూపాయి. జిల్లాలోని బల్లికురవ మండల కేంద్రంలో కొత్తగా మంజూరైన పింఛన్ల పంపిణీ కోసం ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గీయులు వేసిన టెంటును కరణం వర్గం పీకి పారేసింది. దీంతో నడిరోడ్డుపైనే పింఛన్లను పంపిణీ చేస్తానంటూ అప్పటికే అక్కడకు చేరుకున్న గొట్టిపాటి సిద్ధపడ్డారు. అయితే విషయం చంద్రబాబు చెవిన పడటంతో ఆయన నేరుగా గొట్టిపాటికి ఫోన్ చేశారు. విభేదాలు పక్కన పెట్టి మిగిలిన కార్యక్రమాలకు హాజరు కావాలని, బల్లికురువ ఘటనపై తాను విచారిస్తానని గొట్టిపాటికి చంద్రబాబు చెప్పారు. దీంతో చేసేదేమీ లేక గొట్టిపాటి వెనుదిరిగారు. అయితే కొత్తగా మంజూరైన పింఛన్లు తీసుకుందామని ఉత్సాహంగా వచ్చిన లబ్ధిదారులను చూసిన గొట్టిపాటి మనసు కరిగిపోయింది. తన జేబు, తన సన్నిహితుల జేబుల్లో ఉన్న మొత్తం రూ.50 వేలను అక్కడికక్కడే బయటకు తీసిన గొట్టిపాటి వాటిని 50 మంది లబ్ధిదారులకు పంచేసి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News