: అమలాపాల్ తో విడాకులు వాస్తవం...కారణాలు వ్యక్తిగతం: డైరెక్టర్ విజయ్


సినీ నటి అమలా పాల్ ప్రేమపెళ్లి పెటాకులైంది. ఎన్నో ఆశలు, అంచనాలతో జరిగిన సినీ నటి అమలాపాల్, దర్శకుడు విజయ్ ల వివాహం రెండేళ్లకే పెటాకులైంది. ఈ విషయాన్ని అమలాపాల్ భర్త విజయ్ స్వయంగా మీడియాకు వెల్లడించడం విశేషం. అయితే విడిపోవడానికి కారణం ఆమె సినిమాల్లో నటించడం కాదని విజయ్ స్పష్టం చేశాడు. విడిపోయేందుకు కారణాలు వ్యక్తిగతమని విజయ్ తెలిపాడు. వాటిని బయట ప్రస్తావించడం తనకు ఇష్టం లేదని తెలిపాడు. త్వరలోనే చట్టబద్ధంగా తామిద్దరం విడిపోతున్నామని విజయ్ స్పష్టం చేశాడు. కాగా, వీరి విడాకులపై విజయ్ తండ్రి మాట్లాడుతూ, ఆమె సినిమాల్లో నటించడం తమకు ఇష్టం లేదని చెప్పిన సంగతి తెలిసిందే. కాగా, అమలాపాల్ తాజాగా సూర్య, విజయ్ ల సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News