: పరిణామాలపై కేసీఆర్ తో చర్చిస్తా... డివిజన్ బెంచ్ కు అప్పీలు చేస్తాం: హరీష్ రావు
123 జీవోను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ కు అప్పీలు చేస్తామని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, జీవో 123ని 2013 భూసేకరణ చట్టానికి లోబడే తెచ్చామని అన్నారు. నిర్వాసితులకు మరింత న్యాయం చేయాలనే 123 జీవోను తీసుకొచ్చామని ఆయన చెప్పారు. రైతులందరికీ 123 జీవో ద్వారా న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. డివిజన్ బెంచ్ లో ప్రభుత్వానికి న్యాయం జరుగుతుందన్న విశ్వాసం ఉందని ఆయన తెలిపారు. 123 జీవోపై హైకోర్టు తీర్పు, తదనంతర పరిణామాలపై సీఎం కేసీఆర్ తో చర్చిస్తానని ఆయన తెలిపారు.