: నేను బతుకున్నంత కాలం అవార్డుల ఫంక్షన్ నిర్వహిస్తా: ‘సంతోషం’ మ్యాగజైన్ అధినేత సురేష్


'నేను బతికున్నంత కాలం అవార్డుల ఫంక్షన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాను’ అని ‘సంతోషం’ సినీ మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి అన్నారు. ‘సంతోషం’ 14 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 14వ తేదీన సౌత్ ఇండియా ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా పార్క్ హయత్ హోటల్ లో ఇందుకు సంబంధించిన ఒక లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ, ఈ మ్యాగజైన్ స్థాపించి 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని పదిహేనవ సంవత్సరంలోకి అడుగు పెడుతోందన్నారు. ఈ సందర్భంగానే అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరుకానున్నారని సురేష్ చెప్పారు. తన విజయయాత్రకు కారణం తనను వెన్నంటి ఉంటున్న జర్నలిస్టులు, వారి సహకారమేనని చెప్పారు. తమ మ్యాగజైన్ వార్షికోత్సవం సంఖ్య, ఆ వేడుకలు నిర్వహించే తేదీ రెండూ కూడా ‘14’నని, ఆరోజు సెకండ్ సండే కూడా కావడంతో షూటింగ్ లకు కూడా సెలవు ఉంటుందని, అందుకే ఈ తేదీని నిర్ణయించామని సురేష్ చెప్పారు.

  • Loading...

More Telugu News