: షారూఖ్, సల్మాన్ లు రియాలిటీ షోలకు జడ్జీలుగా పనికిరారు!: ఫరా ఖాన్


'ఝలక్‌ దిఖ్‌ లాజా' రియాలిటీ డ్యాన్స్ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఫరా ఖాన్.. సల్మాన్, షారూఖ్ ఖాన్ లపై సంచలన వ్యాఖ్యలు చేసింది. 'ఝలక్ దిఖ్ లాజా' షో ప్రమోషన్ లో పాల్గొన్న సందర్భంగా ఫరా మాట్లాడుతూ, ఈ షోకి తనతో పాటు కరణ్‌ జొహార్‌ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడని చెప్పింది. కరణ్‌ అయితే జడ్జిగా కరెక్ట్‌ గా వ్యవహరిస్తాడని పేర్కొంది. అదీకాకుండా షోలో కరణ్‌ ఉంటే బాగా ఎంజాయ్‌ చేయచ్చని కితాబునిచ్చింది. కరణ్ కంటే సల్మాన్‌, షారుక్‌ లు జడ్జిలుగా వ్యవహరిస్తే మరింత స్టార్ డమ్ ఉంటుంది, షోకి మరింత ప్రచారం వస్తుంది కదా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ, షారుక్‌ జడ్జిగా పనికిరాడనేసింది. షారూఖ్ ఎవరి పెర్ ఫార్మెన్స్‌ చూసినా బాగుందని చెబుతూ ఫుల్‌ మార్కులు వేసేస్తాడని చెప్పింది. అదే సల్మాన్‌ ఖాన్ అయితే నిజాయతీగా ఉంటాడని చెప్పింది. ఎవరి పెర్ ఫార్మెన్స్ చూసినా తన కంటే గొప్పగా డాన్స్ చేశారని ఫీలవుతాడని ఫరా చెప్పింది. దీంతో వారిద్దరూ జడ్జిమెంట్ కి పనికిరారని, తాను, కరణ్ మాత్రమే జడ్జ్ చేయగలమని పరోక్షంగా చెప్పింది.

  • Loading...

More Telugu News