: హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు కెళ్తాం...స్టే వస్తుందని ఆశిస్తున్నా: కడియం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యూనివర్సిటీ వీసీల నియామకాలను హైకోర్టు తప్పుపట్టి, వారి నియామకం చెల్లదంటూ తీర్పు ఇవ్వడంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. హైదారాబాదులో ఆయన మాట్లాడుతూ, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇస్తుందని ఆశిస్తున్నామని అన్నారు. ఎంసెట్-2 రాసిన వారంతా ఎంసెట్-3 రాయవచ్చని ఆయన చెప్పారు. మోడల్ స్కూల్స్, కస్తూర్బా విద్యాలయాలు, గురుకుల పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేస్తామని ఆయన చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వలంటీర్ల ఎంపికను పూర్తి చేశామని ఆయన చెప్పారు.