: 123 తీర్పుపై అప్పీలుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం?
మల్లన్నసాగర్ భూసేకరణ చట్టం 2013 స్థానంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 123ని హైకోర్టు కొట్టివేయడంపై రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు చేయనున్నట్టు తెలుస్తోంది. మల్లన్నసాగర్ భూసేకరణలో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన 123 జీవో ద్వారా అందనున్న పరిహారం గురించి న్యాయస్థానం మరింత సమర్థవంతంగా వాదనలు వినిపించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, 123 జీవోను కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు మొదలయ్యాయి. గాంధీభవన్ లో కాంగ్రెస్ నేతలు బాణాసంచా కాల్చి, స్వీట్లు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వం రైతుల పక్షాన లేకున్నా, న్యాయస్థానం రైతుల పక్షాన నిలిచిందని వారు పేర్కొన్నారు.