: ఆల్మట్టికి మొదలైన భారీ వరద... వచ్చే నీరంతా శ్రీశైలం, సాగర్ లకే!


గత రెండు రోజుల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణమ్మకు మరోసారి భారీ వరద వస్తోంది. అదే సమయంలో ఆల్మట్టి డ్యాంకు వరద నీరు వచ్చి చేరుతోంది. రేపు ఉదయానికి ఆల్మట్టికి లక్ష క్యూసెక్కులకు పైగా వరదనీరు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆల్మట్టి పూర్తి స్థాయి నీటి మట్టం 619.68 అడుగులు కాగా, ప్రస్తుతం 619.51 అడుగుల మేరకు నీరు నిల్వ ఉంది. మరింత నీటిని నిల్వ చేసే అవకాశం లేకపోవడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకు వదలక తప్పని పరిస్థితి. నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు సైతం నిండుకుండలా ఉండటంతో, రేపు లేదా ఎల్లుండికి కృష్ణమ్మకు భారీ వరద ప్రవాహం ఖాయమని నిపుణులు భావిస్తున్నారు. గత రెండు రోజుల వర్షాలతో వస్తున్న వరద శ్రీశైలంతో పాటు, నాగార్జున సాగర్ ప్రాజెక్టునూ నింపుతుందని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News