: నీ భార్య, కుమార్తెకు జరిగితే ఆ నొప్పి తెలుస్తుంది: అజంఖాన్ పై మండిపడ్డ బీజేపీ


బులంద్ షహర్ లో తల్లీ బిడ్డలపై జరిగిన అత్యాచారం ప్రతిపక్షాల కుట్రేనని వ్యాఖ్యానించిన యూపీ మంత్రి అజంఖాన్ తీరు అత్యంత గర్హనీయమంటూ బీజేపీ మండిపడింది. సామూహిక అత్యాచారాన్ని రాజకీయ కుట్రని వ్యాఖ్యానించడంపై బీజేపీ నేత ఐపీ సింగ్, తన సామాజిక మాధ్యమంలో స్పందించారు. "నీ భార్య, కుమార్తెపై సామూహిక అత్యాచారం జరిగితే ఆ నొప్పి ఏంటో నీకు తెలుస్తుంది" అని ట్వీట్ చేయగా, ఇలా మాట్లాడటం తగదంటూ కామెంట్లు వెల్లువెత్తాయి. అయినప్పటికీ, తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, ట్వీట్ ను తొలగించబోనని ఐపీ సింగ్ స్పష్టం చేశారు. మరోవైపు అజంఖాన్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ సైతం మండిపడింది. అత్యాచారాలను ఆపలేకపోతున్న సమాజ్ వాదీ పార్టీ, చౌకబారు ఆరోపణలు చేస్తోందని ఆ పార్టీ నేత రాజ్ బబ్బర్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News