: గొట్టిపాటి, కరణం వర్గాల మధ్య గొడవ... సీఎంకు ఫిర్యాదు చేసిన నేతలు


వైకాపా నుంచి తెలుగుదేశంలోకి ఫిరాయించిన గొట్టిపాటి రవికుమార్ వర్గానికి, సుదీర్ఘకాలంగా టీడీపీలో ఉన్న సీనియర్ నేత కరణం బలరాం వర్గానికి మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తగా అద్దంకి నియోజకవర్గం బల్లికురవలో పోలీసులను మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొత్తగా కొంతమందికి పెన్షన్లు మంజూరు కాగా, వాటిని పంపిణీ చేసేందుకు గొట్టిపాటి వెళ్లారు. తమకు చెప్పకుండా పెన్షన్లు ఎలా పంచుతారని ప్రశ్నిస్తూ కరణం బలరాం వర్గీయులు వివాదాన్ని రేపి, డబ్బు పంపిణీ చేస్తున్న అధికారులను అడ్డుకున్నారు. దీంతో కొంతమందికి గొట్టిపాటి తన సొంత డబ్బును పంచారని తెలుస్తోంది. ఇరు వర్గాల మధ్యా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో అదనపు పోలీసు బలగాలను బల్లికురవ తరలించారు. ఘటనపై సీఎం కార్యాలయానికి అటు గొట్టిపాటి, ఇటు కరణం బలరాం ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు. గొట్టిపాటి రవికుమార్ టీడీపీలో చేరినప్పటి నుంచి రెండు వర్గాల మధ్యా ఆధిపత్య పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News