: జీఎస్ టీ బిల్లును మేమెప్పుడూ వ్యతిరేకించలేదు: కాంగ్రెస్ నేత చిదంబరం


జీఎస్ టీ బిల్లును తామెప్పుడూ వ్యతిరేకించలేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం అన్నారు. రాజ్యసభలో ఈ రోజు ప్రవేశపెట్టిన జీఎస్ టీ సవరణ బిల్లుపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడుతూ, గడచిన 18 నెలలుగా ప్రధాన ప్రతిపక్షం ఆమోదం లేకుండా జీఎస్ టీ బిల్లును ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం ప్రయత్నించి విఫలమైందన్నారు. ఈ బిల్లును తామెప్పుడూ వ్యతిరేకించలేదని, ఈ బిల్లులో సవరణలు అవసరమని తాము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామని అన్నారు. ఈ బిల్లులో సవరణలకు ఎట్టకేలకు అంగీకరించినందుకు సంతోషంగా ఉందని, జీఎస్ టీ సవరణల బిల్లును స్వాగతిస్తున్నామని అన్నారు. సభ్యుల సంఖ్య ఆధారంగా కాకుండా, చర్చల ద్వారా జీఎస్ టీ బిల్లును ఆమోదిస్తారని ఆశిస్తున్నానని చిదంబరం అన్నారు. అయితే, ఈ బిల్లులో ఎలాంటి లోపాలు లేవని ప్రభుత్వం అనడం సరికాదన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో జీఎస్ టీ బిల్లును భారతీయ జనతాపార్టీ వ్యతిరేకించిన విషయాన్ని చిదంబరం ఈ సందర్భంగా గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News