: రాజ్యసభలో జీఎస్ టీ బిల్లును ప్రవేశపెట్టిన అరుణ్ జైట్లీ
కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ఈరోజు రాజ్యసభలో జీఎస్టీ సవరణ బిల్లును కొద్దిసేపటి క్రితం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సవరణ బిల్లుపై చర్చ ప్రారంభమైంది. దేశంలోనే అతిపెద్ద పన్ను సంస్కరణల బిల్లు జీఎస్టీ అని, ఈ బిల్లు ఆమోదం వల్ల పలు రాష్ట్రాలకు ఉపయోగముంటుందని జైట్లీ అన్నారు. ఒకే దేశం, ఒకే పన్ను విధానం ఉండాలని, వస్తు, సేవల పన్ను సవరణల బిల్లుకు అన్ని రాష్ట్రాలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. జీఎస్టీ బిల్లుపై విస్తృత స్థాయి సంప్రదింపులు జరిపామని, ఈ బిల్లుపై ఎంపిక కమిటీ సిఫారసులను పరిగణనలోకి తీసుకున్నామని చెప్పారు. జీఎస్టి బిల్లు వల్లే పన్నుల సంస్కరణలు సాధ్యమని అరుణ్ జైట్లీ పేర్కొన్నారు.