: 'కలలు నిజం కావడమంటే ఇదేనేమో' అంటూ పదేళ్ల క్రితం ఘటనను గుర్తు చేసుకున్న కోహ్లీ!


పదేళ్ల నాడు తాను కన్న కల నిజమైందని టీమిండియా టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ట్విట్టర్ ఖాతాలో తెగ సంబరపడిపోతున్నాడు. అప్పట్లో క్రికెట్ లెజండ్ రాహుల్ ద్రావిడ్ ను కలిస్తే చాలని కలలు కనేవాడినని చెబుతూ, అప్పట్లో దిగిన ఓ ఫోటోను, ఆపై క్రికెటర్ గా ఎదిగిన తరువాత రాహుల్ ద్రావిడ్ ను ఇంటర్వ్యూ చేస్తున్న ఫోటోనూ ట్వీట్ చేసి "కలలు నిజం కావడం అంటే ఇదేనేమో" అని ట్వీట్ చేశాడు. 2006లో అండర్ 19 జట్టులో సభ్యుడిగా ఉన్న వేళ, రాహుల్ ద్రావిడ్ వారిని కలిస్తే, అప్పుడు దిగిన ఫోటోలో సైతం కోహ్లీ కెమెరా వైపు చూడకుండా ద్రావిడ్ వైపే తదేకంగా చూస్తుండటం గమనార్హం. విరాట్ కోహ్లీ మురిపెంగా తన అభిమానులతో పంచుకున్న ఆ చిత్రాన్ని మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News