: వైసీపీ ఎంపీలు పోడియంలో ఆందోళ‌న చేస్తుంటే టీడీపీ ఎంపీలు వారి వారి స్థానాల్లో కూర్చుంటున్నారు: బొత్స


ఆంధ్ర‌ప్ర‌దేశ్ అభివృద్ధి చెందాలంటే ప్ర‌త్యేక హోదా అవ‌స‌రమ‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్ర‌తినిధి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. హైద‌రాబాద్‌లోని వైసీపీ కేంద్ర కార్యాల‌యంలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. హోదా కోసం త‌మ ఎంపీలు లోక్‌స‌భ‌లో పోరాడుతున్నార‌ని అన్నారు. వైసీపీ ఎంపీలు పోడియంలో ఆందోళ‌న చేస్తుంటే టీడీపీ ఎంపీలు మాత్రం వారి వారి స్థానాల్లో కూర్చుంటున్నారని ఆయ‌న విమ‌ర్శించారు. ‘చంద్ర‌బాబుతో అరుణ్ జైట్లీ ఏం మాట్లాడారు.. ప్ర‌త్యేక హోదా ఎప్పుడు ఇస్తామ‌న్నారు?’ అని ఆయ‌న ప్ర‌శ్నించారు. విభ‌జ‌న‌ హామీలను కేంద్రం నెర‌వేర్చాల్సిందేన‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News