: రేపు హస్తినకు చంద్రబాబు!.. ప్రధానితో భేటీలో ప్రత్యేక హోదాపై ప్రస్తావన!


టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రేపు దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ప్రధానితో భేటీలో భాగంగా ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించేందుకు చంద్రబాబు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో జరగనున్న కృష్ణా పుష్కరాలకు హాజరుకావాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పలువురు కేంద్ర మంత్రులకు ఆహ్వానం పలికేందుకే చంద్రబాబు ఈ పర్యటనకు వెళుతున్నట్లు సమాచారం. పనిలో పనిగా ప్రధానితోనూ ప్రత్యేకంగా భేటీ అయి, పుష్కరాల ఆహ్వానం అందివ్వడమే కాకుండా, ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించాలని కూడా ఆయన భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

  • Loading...

More Telugu News